Site icon Prime9

Talangana GOVT : నేతన్నలకు తీపికబురు.. రూ.లక్ష రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీవో

Talangana GOVT

Talangana GOVT : నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రుణమాఫీ పథకానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు ఉన్న రుణాలను తెలంగాణ సర్కారు మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వల్లో పేర్కొన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం..
చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంది. అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను ప్రభుత్వం ఆదరించింది. చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుంది. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామని సీఎం చెప్పారు. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నలకు రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. రుణమాఫీకి ఆదేశాలు ఇస్తున్నామని గతేడాది సెప్టెంబర్‌‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌ హామీనిచ్చారు. తాజాగా హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన అఖిల భారత పద్మశాలీ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. చేనేతకు అండగా ఉండాలన్నది తన ఆలోచన అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలకు పెడతామని వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar