Tenth Hall Tickets on the website : తెలంగాణలోని టెన్త్ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ రోజు నుంచి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 21 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 21న ప్రారంభ ప్రారంభమై.. ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. ఆయా పరీక్ష తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనున్నది. అధికారిక https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తమ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా 11,544 పాఠశాలల నుంచి 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Tenth Hall Tickets on the website : టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు
Tenth Hall Tickets on the website