Site icon Prime9

Telangana Assembly : ఈ నెల 12 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 10,950 గ్రామస్థాయిలో ఆఫీసర్‌ పోస్టులు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. పది జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. మరోవైపు రేపు సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీకి వెళ్లనున్నది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్ఠానంతో చర్చించనున్నది. ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.

Exit mobile version
Skip to toolbar