Site icon Prime9

SLBC tunnel: ఆ ఎనిమిది మంది ఇంకా లోపలే.. అంతు చిక్కని ఆచూకీ!

Telangana SLBC Tunnel Collapse Rescue Operation Underway: తెలంగాణలోని అచ్చంపేట మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు సైతం రంగంలోకి దిగి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలంలో ఇతర అధికారులతో కలిసి కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ రెండూ కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. లోపల చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version
Skip to toolbar