Site icon Prime9

Telangana: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లకు ఆహ్వానం

Telangana Govt Invites New Firms To Supply Liquor Brands: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్‌) కొత్త లిక్కర్ బ్రాండ్స్‌ను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ జతపరచాలి..
టీజీబీసీఎల్‌లో రిజిస్టర్ కానీ కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తులో జతపరచాలని కోరింది. తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇటీవల టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇవ్వడం జరిగింది.

కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు..
కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేశారు. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల ఆహ్వానానికి కొత్త విధానానికి ప్రభుత్వం నాంది పలికింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టీజీబీసీలకు నిర్దేశించింది. టీజీబీసీఎల్ తెలంగాణలో రిజిస్టర్ కానీ కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ప్రకటన జారీ చేసింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పది రోజులపాటు ఆన్‌లైన్‌లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనుమతులపై నిర్ణయం తీసుకోనుంది. టీజీబీసీఎల్‌‌లో రిజిస్టర్ కాబడి సరఫరా చేస్తున్న సప్లయర్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటన్నింటిని తర్వాత తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

Exit mobile version
Skip to toolbar