Site icon Prime9

Komuravelli Jathara: తెలంగాణలోని కొమురవెల్లి మల్లన్న గురించి మీకు తెలుసా.. జాతర ఎప్పుడంటే..?

komarelli mallanna Jathara

komarelli mallanna Jathara

Komuravelli Jathara: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కొమురవెల్లి మల్లన్న దేవాలయం. ఈ ఆలయంలో ఉత్సవాలు సంక్రాంతి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సావాలు జరుగుతాయి.

సిద్దిపేట జిల్లాలో ఈ ప్రముఖ క్షేత్రం వెలసి ఉంది. భక్తులు కోరిన కోర్కెలు కొంగు బంగారం అవుతాయని ఇక్కడి వచ్చే వారు నమ్ముతారు. సంక్రాంతి పండగతో ప్రారంభం అయ్యే బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు కొనసాగుతాయి. ఇక్కడ జరిగే ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడికి వచ్చి మెుక్కులు చెల్లించుకుంటారు.

500 ఏళ్ల మట్టి విగ్రహం

ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. మూడు నెలలపాటు బ్రహ్మోత్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా పేరుపొందింది.

ఈ ఉత్సవాల్లో ప్రతి ఏటా శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున పట్నం నిర్వహిస్తారు.

అలాగే.. ఉగాది ముందు వచ్చే ఆదివారం నాడు నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొంటారు.

ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నట్లు.. అక్కడి ప్రజలు చెబుతారు. గొర్రెలు కాస్తున్న ఓ వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి.. తాను ఇంద్రకీలాద్రిపై వెలిశానని చెప్పినట్లు ప్రజల విశ్వాసం. ఇక్కడ భక్తులు అత్యంత విశ్వాసంగా నమ్మేది పుట్ట మట్టితో తయారు చేసిన స్వామివారి విగ్రహం. సుమారు 500 ఏళ్ల క్రితం తయారు చేసిన మట్టి విగ్రహం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉండటమే దీనికి భక్తుల విశ్వాసానికి ప్రధాన కారణం.

ప్రత్యేక ఆకర్షణగా శివుడు

మరికొందరు పూర్వం కుమారస్వామి తపస్సు చేయడం వల్లే.. కుమరవెల్లి అనే పేరువచ్చినట్లు అక్కడి ప్రజలు చెబుతారు. అది కాల క్రమంలో కొమరవెల్లిగా మారిందని అంటుంటారు. ప్రత్యక్షంగా పరమ శివుడే.. భక్తులను కాపాడేందుకు ఇక్కడకు వచ్చాడని నమ్ముతారు. ఇక్కడ శివుడు లింగ రూపంలోకాక.. నిలువెత్తు గంభీర ఆకారంలో దర్శనమిస్తారు.

ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు.. ప్రభుత్వం తరపున ప్రతి ఏడాది స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు.. వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

ఇవీ చదవండి:

పవన్ కళ్యాణ్ అభిమానులు సైకోలా.. మేకతోటి సుచరిత కామెంట్స్

మీ అన్నతోనే సెల్ఫీ దిగలేదు.. నువ్వెంత.. పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని కామెంట్స్

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version