Prime9

Sri Chaithanya Institution : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు

Sri Chaithanya Institution : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, చెన్నైలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలలో అడ్మిషన్ చేస్తూ ఉంటారు. కొంతకాలంగా కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏకకాలంలో దేశంలోని పలు నగరాలల్లో శ్రీచైతన్య కళాశాలల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో పలు కళాశాలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది. పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని గుర్తించారు. సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar