Hyderabad Nehru Zoo Park Hikes Ticket Prices: నెహ్రూ జూపార్కులో టికెట్ ధరలు పెరగనున్నాయి. మంగళవారం పార్కులో జరిగిన జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నరింగ్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పెంచిన కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్కు క్యూరేటర్ జె.వసంత తెలిపారు.
పెంచిన రేట్లు ఈ విధంగా..
జూపార్కు సందర్శనకు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. ఫొటో కెమెరా అనుమతికి రూ.150, వీడియో కెమెరా (ప్రొఫెషనల్) రూ.2500, కమర్షియల్ మూవీ చిత్రీకరణ కోసం కెమెరాకు రూ.10 ఛార్జి చేయనున్నారు. అన్ని రోజుల్లో రైలు రైడ్ పెద్దలకు రూ.80, పిల్లలకు, రూ.40లుగా నిర్ణయించారు. ఒక వేళ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఎక్కినట్లయితే పెద్దలకు రూ.120 నిర్ణయించగా.. పిల్లలకు రూ.70 చొప్పున వెల్లడించారు.
డ్రైవ్ సీఎన్‌జీ బస్సులకు..
సఫారి పార్కు డ్రైవ్ సీఎన్‌జీ బస్ 20 నిమిషాలకు ఏసీ రూ.150, నాన్ ఏసీ రూ.100 చొప్పున వసూలు చేయనున్నారు. 11 సీట్లు గల న్యూ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్‌లో 60 నిమిషాలపాటు షికారు చేస్తే రూ.3,000, 14 సీట్ల బీఓవీ ఎక్స్‌క్లూజివ్ వాహనంలో కలియ తిరిగితే రూ.4,000 వసూలు చేస్తారు.
వాహనాల పార్కింగ్‌కు..
జూపార్కు సందర్శించేందుకు తీసుకొచ్చే వాహనాలు పార్కింగ్ సంబంధించి సైకిల్‌కు రూ.10, బైక్ రూ.30, ఆటో రూ.80, కారు లేదా జీప్ రూ.100, టెంపో లేదా తూఫాన్ వాహనం రూ.150, 21 సీట్లు గల మినీ బస్ రూ.200,.. 21 సీట్లు పైగా ఉన్న బస్ రూ.300 చొప్పున ధర నిర్ణయించినట్లు జంతు ప్రదర్శనశాల సంరక్షులు వసంత పేర్కొన్నారు.