Site icon Prime9

Gachibowli: గచ్చిబౌలిలో ఒరిగిన భారీ భవనం.. తీవ్ర భయాందోళనలతో జనం పరుగులు

Gachibowli Building Tilted: గచ్చిబౌలిలో ఓ ఐదంతస్తుల భవనం ఉన్నట్టుండి ఓ పక్కకు ఒరిగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అందులో ఉండే వారితో పాటూ చుట్టు పక్కల ప్రజలు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఒకవేళ భవనం కుప్పకూలితే మాత్రం భారీ ప్రాణనష్టం సంభవించేది. ఈ ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో రెండేండ్ల కింత ఐదంతుస్తుల భవనం నిర్మించారు. ఆ భవనం మంగళవారం రాత్రి ఉన్నట్టుండి పెద్ద శబ్దం చేస్తూ ఒకవైపుకు ఒరిగింది. ఈ భవనం పక్కన ఇంకో ఇంటి నిర్మాణ కోసం సెల్లర్ గుంత తవ్విన కారణంగానే ఇలా జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

కూల్చివేతలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు
ఒరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉపక్రమించారు. చుట్టు పక్కల ఉన్న నివాసాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించి  భవనాన్ని కూల్చి వేయిస్తున్నారు. కూల్చి వేతలను శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Exit mobile version