Site icon Prime9

Suryapet: కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనక్కిపంపిన రైస్ మిల్లర్.. రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

Farmer Couple Attempt Suicide in Suryapet: క్వింటాలుకు ఏడున్నర కిలోల తరుగు కోతకు రైతు అంగీకరించలేదన్న కారణంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతగా లేదంటూ రైస్ మిల్లర్ నిర్వాహకులు తిప్పి పంపారు. దీంతో నిరసిస్తూ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చౌళ్లతండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యాజమాని పరిశీలించి నాణ్యత లేదని, ఏడున్నర కిలోల తరుగుకు ఒప్పకుంటేనే దిగుమతి చేసుకుంటామని మిల్లు యాజమాని చెప్పాడు.

కేజీ తరుగుకు మాత్రమే ఒప్పుకుంటామని చెప్పిన దంపతులు..
కేజీ తరుగుకు మాత్రమే ఒప్పుకుంటానని రైతులు తెప్పారు. దీంతో అంగీకరించని రైస్ మిల్లు యజమాని ధాన్యాన్ని తిప్పిపంపాడు. తీవ్ర మనస్తా పానికి గురైన రైతు దంపతులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న సిబ్బంది దంపతులను అడ్డుకున్నారు. క్వింటాలుకు ఏడున్నర కిలోల తరుగు కోత చేస్తానని మిల్లర్ అంటున్నాడని, అలాగైతే 425బస్తాలకు 13క్వింటాళ్లు తరుగు పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. కౌలు చేసి పంట పండిస్తే మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version
Skip to toolbar