Telangana Liberation Day: ఒకే వేడుక… పార్టీలు వేరువేరుగా… ఎవరెలా స్పందిస్తున్నారంటే..!

తెలంగాణ రాష్ట్ర వాప్యంగా సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోటాపోటీగా ఇటు తెరాస, భాజపా అటు కాంగ్రెస్ పార్టీలు ఈ వేడుకలను జరుపుతున్నాయి.

12 sep 2022, 15:26PM

కాంగ్రెస్ అంటే తెలంగాణ..

గాంధీభవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అంటే తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.
పేద ప్రజల తరుపున బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీ, మహిళల తరఫున ఆనాడు వీరోచితంగా పోరాటం చేసి ఈ స్వతంత్య్రాన్ని సంపాధించుకున్నామని ఆయన తెలిపారు.

12 sep 2022, 15:20PM

రాష్ట్ర విలీనంలో కమ్యూనిస్టుల పాత్ర లేకుండా కుట్ర..

చరిత్రను వక్రీకరించి రాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శించారు. హైదారాబాద్లోని పార్టీ ఆఫీస్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
హైదరాబాద్ రాష్ట్ర విలీనంలో కమ్యూనిస్టుల పాత్ర లేకుండా చేసే కుట్ర జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సాయుధ పోరాటం వల్లే నిజాం పాలన అంతమయ్యిందని.. మట్టిమనుషులు ఉక్కుమనుషులుగా మారి పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు.

12 sep 2022, 14:52

అటు విమోచన దినోత్సవాలు… ఇటు ఆదివాసీల ఆత్మీయ కలయిక

జాతీయ సమైక్యతా దినోత్సవాలను ప్రభుత్వం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనుంది. కాగా ఎన్టీఆర్ స్టేడియంలోనే ఆదివాసీల ఆత్మీయ కలయిక సభను కూడా వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. వారివారి సాంప్రదాయ వేషధారణలో ఆదివాసీలు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివస్తున్నారు. ఈ రోజు 4గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

12 sep 2022, 14:40

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని సిత్రాలు సూద్దామా..

సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవాలకు సంబంధించిన ఫొటోలు చూసేద్దాం. అమిత్ షా ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగామ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం పలువురు నేతలను ఆత్మీయంగా పలకరించారు ఆ తర్వాత ప్రసంగించారు.

12 sep 2022, 13:58PM
అది మరో జలియన్ వాలాబాగ్..!

తెలంగాణలో మరియు మహారాష్ట్ర మరికొన్ని నిజాం ప్రాంతాల్లో రజాకార్లు సృష్టించిన నరమేధాన్ని మరో జలియన్ వాలాబాగ్ గా అభివర్ణించారు కేంద్ర మంత్రి అమిత్ షా.బీదర్ జిల్లా కోటలో మహిళలను తీవ్ర అవమానాలకు గురిచేశారని.. గుండ్రాంపల్లిలో హత్యాకాండకు ఒడిగట్టారని ఆయన పేర్కొన్నారు.

12 sep 2022, 13:46PM
హైదరాబాద్లో ఆదివాసీ, బంజారా భవన్లు..
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 10లో ఆదివాసీ, బంజారాలకు నిర్మించబడిన రెండు భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రూ. 24.68 కోట్లతో ఆదివాసీ మరియు రూ.24.43 కోట్లతో బంజారా భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ, గిరిజన మంత్రిత్వ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కు ఆదివాసీలు వారి ఆచారం ప్రకారం ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

13:30PM
డ్యాన్స్ వేసిన ఎమ్మెల్యే… విజిల్ కొట్టిన మంత్రి..!

మహబూబాబాద్లోనూ తెలంగాణ విమోచన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కాగా ఎమ్మెల్యే శంకర్ నారాయణ విద్యార్థులతో కలిసి చిందులేశారు. మరియు అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను చూసి మైమరిచిపోయిన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ విజిల్స్ వేశారు. ఈ సన్నివేశాలను చూసిన ప్రజలు హర్షిస్తున్నారు. సామాన్య ప్రజల్లా మంత్రి, ఎమ్మెల్యే విమోచనా వేడుకలను ఆనందంగా ఆస్వాదించడం చూసి మెచ్చుకుంటున్నారు.

13:10PM
ఆనాటి అమరవీరులకు శిరస్సానమామి- కేసీఆర్
తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆనాటి స్వంతంత్ర సమరంలో పాల్గొని అమరులైన వీరులందరికీ తను తలవంచి నమస్కరిస్తూన్నానంటూ పేర్కొన్నారు. ఈ రోజును చరిత్రలో గుర్తిండిపోయే రోజంటూ ఆయన అభివర్ణించారు.