Site icon Prime9

Kishan Reddy: తెలంగాణలోనూ బీజేపీదే అధికారం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి

BJP leaders celebrate Delhi victory at State office In Hyderabad: ఢిల్లీలో బీజేపీ గెలిచిన విధంగా తెలంగాణలోనూ బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ గెలుపొందడంపై హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ మాదిరిగా తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధి ఏంటో ఢిల్లీలో చేసి చూపిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు సంబరాలు చేసుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. అనంతరం ఒకరినొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version
Skip to toolbar