Site icon Prime9

ACB Raid : కాళేశ్వరం ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB Raid

ACB Raid

ACB Raid : కాళేశ్వరం కమిషన్ విచారణ చివరిదశకు చేరుకుంది. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. షేక్‌పేట్‌‌లోని ఆదిత్య టవర్స్‌‌లో ఉన్న హరిరామ్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తించారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల సమీకరణలో కీలకంగా వ్యహరించారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ భార్య అనిత నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

 

 

కమిషన్ ఎదుట హరిరామ్ స్టేట్‌మెంట్ ఇలా..
కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27వ తేదీ జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ హరిరామ్‌ను విచారించింది. జస్టిస్ పీసీ చంద్రఘోష్ ఆయనకు 90కి పైగా ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపుల విషయంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై కూడా కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా తీసుకున్నరుణాలు బ్యాంకులకు చెల్లించినట్లు విచారణలో తెలిపారు. బ్యాంకులకు మొత్తం రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా తెలిపారు.

 

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.64 వేల కోట్లు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లించామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను ఇప్పటికే నూతనంగా ఏర్పడిన సర్కారుకు అందజేసినట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డామేజ్‌కు బాధ్యులు ఎవరంటూ చంద్రఘోష్ కమిషన్‌ హరిరామ్‌ను ప్రశ్నించారు. గేట్ల ఆపరేషన్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం అందుకు ప్రధాన కారణమని చెప్పారు. 2017లో నాటి ఉన్నత స్థాయి కమిటీ అంశాలను కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ ఫాలో కాలేదని హరిరామ్ కమిషన్ ఎదుట హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు.

 

 

Exit mobile version
Skip to toolbar