Telangana Secretariat : హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సచివాలయ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, డ్రోన్ ఎగరేసిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వంశీ, నాగరాజు అనే ఇద్దరి వ్యక్తులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సచివాలయ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు సమాచారం. వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Telangana Secretariat : సచివాలయంపై డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు
Telangana Secretariat