Bhadrachalam: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో లడ్డూ విక్రయ శాలను సీజ్ చేసేందుకు వెళ్లిన పోలీసులను ఆలయ ఉద్యోగులు అడ్డుకున్నారు. భద్రాచలం(Bhadrachalam) ఆలయంలో బూజు పట్టిన లడ్డూలతో పాటు ప్రసాదాలను విక్రయించారని భక్తులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో బూజు పట్టిన లడ్డూ ప్రసాదాలున్న ప్రసాదాల విక్రయశాలను సీజ్ చేసేందుకు సోమవారం నాడు పోలీసులు వచ్చారు. అయితే లడ్డూ ప్రసాద కౌంటర్ ను సీజ్ చేయకుండా ఆలయ ఉద్యోగులు అడ్డుకుని నిరసనకు దిగారు. ఈ సందర్బంగా పోలీసులకు, ఆలయ సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది.
దేవాలయ శాఖకు చెందిన అధికారులు కాకుండా పోలీసులు రంగ ప్రవేశం చేయడంపై ఆలయ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయ కౌంటర్ ను సీజ్ చేయకుండా నిరసనకు దిగారు. ఈ నెల 2వ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున లడ్డూల తయారీ చేశారు. అయితే ఆ రోజున భక్తులకు విక్రయించగా మిగిలిన లడ్డూలను భద్రపర్చడంలో జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో లడ్డూలకు బూజు పట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఆదివారం ఇక్కడ బూజుపట్టిన లడ్డూరు లిక్రయించబడును అంటూ కొందరు భక్తులు ప్రసాదం విక్రయించే కౌంటర్ వద్ద పేపర్ పై రాసి అంటించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ విషయమై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ప్రసాద కౌంటర్ సీజ్ చేసేందుకు వచ్చారు. పోలీసులను ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే సిబ్బంది తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే ధర్నా చేపతున్నారని భక్తుల ఆరోపించారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/