CM Revanth Reddy: ధరణి పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

భూములకి సంబంధించిన ధరణి పోర్టల్‌పై  ఎక్కువగా ఫిర్యాదులు  రావడంతో సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ధరణి యాప్ భద్రతపై సిఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆరా తీశారు. ధరణిలో ఉన్న లోటుపాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ఎ కమిషనర్ నవీన్ మిట్టల్‌ని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

  • Written By:
  • Updated On - December 13, 2023 / 07:56 PM IST

CM Revanth Reddy:భూములకి సంబంధించిన ధరణి పోర్టల్‌పై  ఎక్కువగా ఫిర్యాదులు  రావడంతో సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ధరణి యాప్ భద్రతపై సిఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆరా తీశారు. ధరణిలో ఉన్న లోటుపాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ఎ కమిషనర్ నవీన్ మిట్టల్‌ని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

భూముల వివరాలపై నివేదిక..(CM Revanth Reddy)

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలని నివేదికలో పొందు పరచాలని రేవంత్ సూచించారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని రేవంత్ సూచించారు. ధరణి సమస్యల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధరణిపై మరోసారి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికీ పలు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ సందర్బంగా ధరణి యాప్ భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసారు. త్వరలోనే నిపుణులు, అధికారులతో ధరణిపై కమిటీ వేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ సందర్బంగా రెవెన్యూ డిపార్టుమెంట్లో ఉద్యోగాల భర్తీ గురించి కూడా రేవంత్ రెడ్డి చర్చించారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు బుధవారం అసెంబ్లీ, మండలిలో తిరుగుతూ పరిశీలించారు. మార్పులకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలనాటికి ఈ తంతు పూర్తి కావాలని రేవంత్ రెడ్డి సూచించారు. పార్లమెంటు మాదిరిగా అసెంబ్లీ కనిపించాలని, అసెంబ్లీ, మండలి కలిపి ఒకే బిట్‌లా కనిపించేలా మార్పులు జరగాలని రేవంత్ అన్నారు. పార్లమెంటు వద్ద విజయ్ చౌక్ లా మార్పులు చేయాలి అంటూ రేవంత్ ఆదేశాలిచ్చారు. పార్కింగ్, ల్యాండ్ స్కేప్‌కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులని కోరారు.