APPSC Jobs Age Limit: నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేసే ఉద్యోగుల వయోపరిమితిని పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫాం సర్వీసెస్ ర్రికూట్‌మెంట్‌లో రెండేళ్ల వయోపరిమితిని పెంచగా, నాన్ యూనిఫాం ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
త్వరలోనే ఏపీలో మెగా డీఎస్సీతోపాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించగా, ఇప్పుడు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగా, ఎన్నికల కమిషన్ ఎలక్షన్ ఎత్తివేయనున్నది. మరికొద్దీ రోజుల్లో ఉద్యోగ నియమాకాలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర నియామక సంస్థల ద్వారా తదుపరి నియామకాలకు అన్ని నాన్ యూనిఫాం సర్వీసుల్లోని పోస్టులకు 34 నుంచి 42ఏళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిని సడలించింది. రాష్ట్ర, సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో లేదా సంబంధిత స్పెషల్ లేదా అడ్హాక్ రూల్స్‌లో శారీరక ప్రమాణాలు నిర్దేశించబడిన పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ, రవాణా శాఖల యూనిఫాం సర్వీసుల పోస్టులకు ప్రత్యక్ష నియామకానికి ఈ నియమంలోని ఏదీ వర్తించదని స్పష్టం చేసింది.