Prime9

SC Serious on Sajjala: మీ పోస్టులు మాకు అర్ధం కావనుకున్నారా? సజ్జలపై సుప్రీం సీరియస్!

Supreme Court Serious on Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జస్టిస్ పంకజ్ మిత్తల్, ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం స్పష్టం చేసింది.

 

సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లిందన్న సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

 

సోషల్ మీడియాలో సజ్జల పెట్టిన పోస్టులపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు పెట్టిన పోస్టులు అర్థం చేసుకోలేమా అని ప్రశ్నించింది. పోస్టులు భరించరాని స్థాయికి వెళ్లాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగం చేసిన కేసుల్లో బెయిల్ వస్తుందని అనుకోవద్దని స్పష్టం చేసింది. ఇటాంటి వాటిని వ్యవస్థ క్షమించదు తప్పక శిక్షిస్తుంది.

 

Exit mobile version
Skip to toolbar