Prime9

NEET Exam 2025: నేడే దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షలు

NEET re exam 2025: ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి  1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5వరకు పరీక్షలు జరగనున్నాయి.

 

గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్‌ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖ వ్యాప్తంగా మొత్తం 16 కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. పరీక్షలకు హాజరుకానున్న 7344 మంది విద్యార్థులు హాజరుకానున్నాయి. ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు తెలిపారు.

 

నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షలు
ఉదయం, మధ్యాహ్నం 2 షిప్టులుగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి పరీక్షకు 72,507 మంది విద్యార్ధులు హజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar