Site icon Prime9

TDP : వైఎస్‌ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్త సస్పెండ్‌

TDP

TDP

High command takes serious action against ITDP activist Kiran : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ భార్య వైఎస్‌ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కార్యకర్తపై టీడీపీ అధిష్ఠానం సీరియస్‌ అయ్యింది. భారతిపై సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. వీడియో వైరల్‌గా మారడంతో వైసీపీ కార్యకర్తలు కిరణ్‌ను టార్గెట్‌ చేసి కామెంట్లు పెడుతున్నారు. భారతిపై కిరణ్‌ చేసినవ్యాఖ్యలను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. భారతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

 

ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై అధిష్ఠానం ఆగ్రహం..
వైఎస్ జగన్ భార్య భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని అధిష్ఠానం స్పష్టం చేసింది. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ఆదేశాలతో పోలీసులు అతడిపై నమోదు చేశారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో అధిష్ఠానం కూడా సీరియస్‌ కావడంతో తప్పు చేశానని కిరణ్ తెలుసుకున్నారు. క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని, తనను క్షమించాలని కోరుతూ వీడియో విడుదల చేశాడు. జగన్‌, భారతికి క్షమాపణ చెప్పిన కిరణ్‌.. భారతమ్మ కాళ్లు పట్టుకొని తాను క్షమాపణ కోరతానంటూ వ్యాఖ్యానించాడు.

 

Exit mobile version
Skip to toolbar