Prime9

Hanuman Shobha Yatra: ఏపీలో వైభవంగా హనుమాన్ జయంతి శోభా యాత్ర

Hanuman Shobha Yatra in Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర అత్యంత వైభంగా జరిగింది. హిందూ సురక్ష సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర స్థానిక సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వేలాది మందితో ప్రారంభమై పట్టణ వీధుల సాగింది. యువకులు, భక్తులు అత్యధిక మంది కాషాయం జెండాతో ర్యాలీలో పాల్గొని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

విజయనగరంలో హనుమన్ జయంతి సందర్భంగా ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. పట్టణంలోని కోట జంక్షన్ నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన కూడళ్లమీదుగా సాగింది. హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో స్వామి శ్రీనివాసానంద సరస్వతీ స్వామి, సినీ నటి కళ్యాణి పాల్గొన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు.

 

అన్నమయ్యజిల్లా మదనపల్లెలో హనుమాన్ జయంతి hanuman jayanthi shobha yatra in andhra pradesh శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మదనపల్లి పట్టణ పురవీధుల్లో హనుమంతుడు విగ్రహం ఊరిగింపుగా తీసుకెళ్ళారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 వందల మంది పోలీసులతో మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పట్టణమంతా జై హనుమాన్, జై జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగింది. గతంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర కంటే ఈ సంవత్సరం భారీగా ప్రజలు తరలివచ్చారని హిందూ సంఘాలు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar