Site icon Prime9

Nandigam Suresh: నందిగం సురేశ్‌కు అస్వస్థత

Former Bapatla MP Nandigam Suresh illness: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. భుజంతో పాటు ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్‌ షుగర్, బీపీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు.

ఇందులో భాగంగానే బీపీ, ఛాతిలో నొప్పి వస్తున్నట్లు జిల్లా జైలు అధికారులకు తెలపగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఈసీజీ తదితర పరీక్షలు చేయగా.. సాధారణంగా ఉన్నాయి. దీంతో ఆయనను అధికారులు తిరిగి జిల్లా జైలుకు తరలించారు.

వైసీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ మేరకు ఆయనను న్యాయస్థానం రిమాండ్ విధించారు.

Exit mobile version