Site icon Prime9

Andhra Pradesh News: మహాశివరాత్రి వేళ తీవ్ర విషాదం.. పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తులు మిస్సింగ్!

Five drown Godavari in shivratri celebrations: శివరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తులు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరి నదిలోకి స్నానం చేసేందుకు 11 మంది దిగారు. నీటి ఉధృతి అధికంగా ఉండడంతో అందరూ కొట్టుకుపోయారు. ఇందులో ఆరుగురు బయటపడగా.. మిగతా ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు.

అయితే, సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాల్లు గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా తాడిపూడి గ్రామానికి చందిన యువకులుగా గుర్తించారు. ఇందులో తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనిసెట్టి పవన్, గుర్రె ఆకాష్, పడాల సాయిగా ఉన్నారు. తెల్లవారుజామున నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. నదిలో లోతు ఎంతమేర ఉందనే విషయం తెలియక దిగడంతో మునిగిపోయారని, రక్షించుకునే క్రమంలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారని అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు.

నదిలో లోతుగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. వీరంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నారు. యువకులు ఓకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న గాలింపు చర్యలను కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Exit mobile version
Skip to toolbar