Site icon Prime9

AP Budget 2025: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పయ్యావుల కేశవ్..!

AP Budget 2025

AP Budget 2025: ఏపీ శాసససభలో 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48 వేల కోట్లు కేటాయించగా, రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాకుండా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.6,705 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు కేటాయించారు.

బడ్జెట్ అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రుణం సున్నాకు చేరుకుందని చెప్పారు. అప్పు తీసుకొనే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని అన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబుకు ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar