Site icon Prime9

TDP MLC Candidates : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. మూడు స్థానాలకు ప్రకటించిన సీఎం చంద్రబాబు

TDP MLC Candidates

TDP MLC Candidates : టీడీపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠకు తెరపడింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర కసరత్తు చేసి, మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. రేపటితో నామినేషన్‌ గడువు ముగియనున్నది. దీంతో అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరుగనుండగా, ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేన పార్టీకి కేటాయించారు. పార్టీ తరఫున నాగబాబు నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో బీజేపీకి ఒక స్థానం కేటాయించాలని పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. టీడీపీ నుంచి ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది.

ఈసారి బీజేపీకి ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు పార్టీ పెద్దలు సర్ది చెబుతున్నారు. ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి జవహర్‌, దువ్వారపు రామారావు, టీడీ జనార్ధన్‌కు అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం.

Exit mobile version
Skip to toolbar