Site icon Prime9

AP Govt Nominated Posts: ఏపీలో భారీగా నామినేటెడ్‌ పదవుల భర్తీ.. 10 నామినేటెడ్‌ పోస్టులు దక్కించుకున్న జనసేన

AP Nominated Posts Second List Released: రాష్ట్రంలో సామాజిక, రాజకీయ న్యాయానికి సమతూకం కుదిరింది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ – జనసేన – బీజేపీ వివిధ నామినేటెడ్‌ పదువులను దక్కించుకున్నాయి. ఆయా పార్టీల ముఖ్య నాయకుల సమక్షంలో ఇది వరకే నిర్ణయించిన ధామాషా ప్రకారం కేటాయింపులు జరిగాయి. ఇందులో జనసేన దాదాపు 16శాతం దక్కించుకోవడం విశేషం.

నామినేటెడ్‌ పదవుల  భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. తొలి జాబితాలో ఆర్టీసీ, పౌర సరఫరాలు, ఏపీఐఐసీ, వక్స్‌ బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు చైర్మన్‌ లతో పాటు ఆర్టీసీకి వైస్‌ చైర్మన్‌ లను కూడా నియమించింది. తాజాగా వివిధ సామాజిక వర్గాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ లకు చైర్మన్‌ లను నియమిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. దీంతో పాటు పట్టాభిరామ్‌ (స్వచ్చ ఆంధప్రదేశ్‌ మిషన్‌ ), తేజస్వీ (ఏపీ కల్చరల్‌ మిషన్‌(తేజస్వీ), జీవీ రెడ్డి ( ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌), సుజయ్‌ కృష్ణ రంగారావు (అటవీ అభివృద్ధి), జి.కోటేశ్వరరావు (గ్రంథాలయ పరిషత్‌) సహా వివిధ పట్టణాల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథానిటీ లకు చైర్మన్‌ లను కూడా నియమించింది. పొత్తు ధర్మాన్ని పాటించి, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వారికి అందులో గుర్తింపు లభించింది. మొత్తం 59 మందిని నామినేటెడ్‌ పదవుల్లో నియమించగా… ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా నియమించి, కేబినెట్‌ ర్యాంకుతో సముచిత స్థానం కల్పించారు. ఈ సామాజిక కూర్చుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా వారంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

చైర్మన్లుగా నియమితులైన జనసేన నాయకులు…

సామాజిక ప్రగతికి కృషి చేస్తా..
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచనల ఉత్తరాంధ్ర జిల్లాలతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న తూర్పుకాపుల సామాజిక ప్రగతికి నావంతు కృషి చేస్తానని తూర్పుకాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి, వలస కార్మికులకు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. నిధుల సద్వినియోగంతో పాటు… తూర్పుకాపు లను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూస్తున్న రోజుల నుంచి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వారిగా మలచేందుకు ప్రత్యేక కార్యచరణతో పని చేస్తానని వెల్లడించారు.

పదవులు దక్కించుకున్నది వీరే..

Exit mobile version