Site icon Prime9

Group 2 Mains Exams: ప్రారంభమైన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు

APPSC Group 2 Mains Exams Started: ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ తొలి పేపర్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్ జరగనుంది. అయితే పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు, పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈ పరీక్షను 92,250 మంది అభ్యర్థులు రాస్తున్నారు. మొత్తం 905 పోస్టులకు గానూ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Exit mobile version
Skip to toolbar