Site icon Prime9

DGP on Shakthi App: అత్యాధునిక ఫీచర్లతో ‘శక్తి’ యాప్.. ఏపీలో భారీ రెస్పాన్స్

dgp

dgp

DGP on Shakthi App: రాష్ట్రంలోని మహిళల భద్రతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు శక్తి మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టారని డీజీపీ హరీశ్ కుమార్ గుప్త తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ యాప్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు.

 

మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.52 కోట్లకు పైగా శక్తి యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించారు. హిందీ, ఇంగ్లీష్ లో శక్తి యాప్ అందుబాటులో ఉందని అన్నారు. మహిళల భద్రతకు రాష్ట్రంలో మొత్తం 164 శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. మహిళలపై తరచూ నేరాలు జరిగే 900 హాట్ స్పాట్స్ గుర్తించామని డీజీపీ వెల్లడించారు.

 

మహిళల భద్రత కోసం అత్యాధునిక ఫీచర్లతో యాప్ రూపొందించామన్నారు. మహిళలు, బాలికలు ఆపద సమయంలో సాయం అందించేందుకు ఇది కీలకంగా పనిచేస్తుంది వివరించారు. వన్ టచ్ ఎస్ఓఎస్ బటన్ తో వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లడంతో వారు అప్రమత్తమవుతారని చెప్పారు. శక్తి యాప్ తో లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లోకేషన్, 10 సెకన్ల ఆడియో, వీడియో కంట్రోల్ రూమ్ కు పంపబడతాయి. దీంతో పోలీసులు క్షణాల్లో స్పాట్ కు వెళ్లి మహిళలు, బాలికలను రక్షిస్తారని తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar