Site icon Prime9

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

AP Deputy CM Pawan Kalyan tweet about mgr: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 17తో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ స్థాపించిన ‘ఏఐఏడీఎంకే’ పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఎంజీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

‘పురచ్చి తలైవర్’ ఎంజీఆర్‌పై అభిమానం తాను చిన్నప్పుడు చెన్నైలో ఉన్న సమయంలో మొదలైందని తెలిపారు. ఎంజీఆర్‌పై ప్రేమ, అభిమానం నాలో ఇమిడిఉన్నాయని, ఆ ప్రేమాభిమానాలు ఎప్పటికీ చెరిగిపోవన్నారు. మైలాపూర్ లో చదువుతున్న సమయంలో మా తమిళ భాషా ఉపాధ్యాయుడి ద్వారా పురచ్చి తలైవర్ గురించి తొలిసారిగా తెలుసుకున్నానని చెప్పారు. ఇందులో పరోపకారం, దయాగుణం, నిష్కపటత్వం, ప్రజల పట్ట శ్రద్ధ వంటి నాలుగు విషయాలను కలిగి ఉన్న రాజులకు ఆయన వెలుగని పవన్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, గంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన వ్యాఖ్యలను ఉద్దేశించి తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో డీఎంకే నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్‌పై కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్.. డీఎంకే పార్టీ విరోధి అయిన ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్‌ను పొగుడుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version