Site icon Prime9

CM Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం చంద్రబాబు

Andhra CM Naidu Meets Union Minister Nitin Gadkari: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 7న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం కలుసుకున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీని వల్ల రవాణా వ్యవస్థ మెరుగు పడటంతో పాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రాధాన్యత గుర్తించి, నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం, పోర్టులు, సముద్ర తీర ప్రాంతాలను కలిపే విధంగా సాగరమాల ప్రాజెక్టు పనులు చేపట్టాలని విన్నవించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Exit mobile version