Prime9

Borugadda Anil Remand: బోరుగడ్డ అనిల్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్

14 Days Remand to Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతనికి వచ్చేనెల మూడో తేదీ వరకు గుంటూరు ఆరవ అదనపు కోర్టు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ మీద అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. రిమాండ్ విదించడంంతో బోరుగడ్డ అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదిరించడంపై కేసు నమోదైంది. 2016 మే 9న తన స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సర్వేయర్‌ను బెదిరించారు. విధులు ఆటంకం కలిగించి బెదిరించడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎనిమిది ఏళ్లుగా ఈ కేసులో కోర్టుకి అనిల్ హాజరుకాలేదు.

 

 

 

Exit mobile version
Skip to toolbar