Site icon Prime9

Save Cooking Gas: చిన్న చిన్న చిట్కాలతో గ్యాస్‌ ఆదా చేయండిలా..

Save Cooking Gas

Save Cooking Gas

Save Cooking Gas: ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ వంట గ్యాసే ఉపయోగిస్తున్నారు. అయితే, వంట గ్యాస్‌ ధర రోజురోజుకీ పెరిగి సామాన్యుల భారం పడింది. ఇప్పటికే నిత్య అవసరాల, ఇతర ధరలు పెరిగి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే .. మరో పక్క గ్యాస్ ధరలు మరింత కుంగదీస్తున్నాయి. అందుకే గ్యాస్ ను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే గ్యాస్ ఎక్కువ రోజులు వచ్చేలా చూసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న చిట్కాలతో గ్యాస్‌ ఆదా చేయొచ్చు.

వంటకు కావాల్సిన అన్ని పదార్థాలను రెడీ చేసుకున్న తర్వాతే వంటను మొదలుపెట్టండి. ముందుగా కూరగాయలు మొత్తం కట్ చేసుకుని పెట్టుకోవాలి. కావాల్సిన మసాలలు కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఇవ్వన్నీ అప్పటికప్పుడే సిద్ధం చేస్తుంటే వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్ వినియెగం కూడా పెరుగుతుంది. ఈ చిట్కాలతో వంట చేయడం వల్ల గ్యాస్ ను సేవ్ చేసుకోవచ్చు.

రోజు అంతా సరిపోయేలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూర వండుకోవడం మంచిది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా వేర్వేరు గా వండటం వల్ల గ్యాస్‌ ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. అదే మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఒక గంట ముందు వండుకుంటే.. అదే రాత్రికి కూడా వస్తుంది. దీనివల్ల రెండు మూడుసార్లు గ్యాస్‌ను వాడాల్సిన అవసరం ఉండదు.

 

 

ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే..(Save Cooking Gas)

ప్రెషర్ కుక్కర్‎లో వంట చేయడం వల్ల గ్యాస్‎ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ప్రెషర్‌ కుకర్‌ అధిక పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుక్కర్‌లో పెట్టుకునే వీలు ఉంది. కాబట్టి త్వరగా వంట పూర్తి అవుతుంది. గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది.

ఆహారాన్ని ఫ్రిజ్ లో నుంచి తీసిన వెంటనే నేరుగా గ్యాస్‎పై వేడి చేయవద్దు. అలా చేయడం వల్ల ఆహారాన్ని వేడి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల ఎక్కువ గ్యాస్ అవుతుంది. ఫ్రిజ్ నుంచి ఆహారం బయటకు తీసిన తర్వాత ముందు సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాతే దాన్ని వేడి చేయండి.

చిన్న పాత్రలో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్‌ ను వాడకపోవడమే మంచిది. అలా వాడటం వల్ల మంట చాలా వరకు బయటికి పోతుంది. అలా కూడా గ్యాస్‌ వృథా అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది.

 

 

బర్నర్స్ క్లీన్ గా

స్టవ్ బర్నర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది త్వరగా వేడెక్కి వంట కూడా త్వరగా పూర్తవుతుంది. వంట పూర్తయ్యే కొంచెం ముందే స్టవ్‌ ఆఫ్ చేసి గిన్నె మీద మూత తీసేయకండి. లోపల ఉన్న వేడి ఆ మిగతా వంటను పూర్తి చేస్తుంది. దీనివల్ల గ్యాస్‌ ఆదా అవుతుంది.

వంట చేస్తున్నప్పుడు గిన్నె మీద మూత పెట్టే ఉంచండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల లోపల ఉన్న వేడి బయటికి పోదు. ఆ వేడి మీదే త్వరగా ఉడుకుతుంది. అదే విధంగా వేడినీళ్లను మీద మాత్రం గ్యాస్‌ మీద పెట్టొద్దు. నీళ్లు వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఎక్కువ గ్యాస్‌ వాడాల్సి వినియోగం అవుతుంది.

గ్యాస్ ఎప్పుడు హై ప్లేమ్‎లో పెట్టకూడదు. మీడియం నుండి తక్కువ వేడి మీదం వంట చేయాలి. మంట పెద్దగా పెట్టి వంట చేస్తే.. గిన్నే చుట్టూ మంట పెంచి గ్యాస్ వృథాను పెంచుతుంది. గ్యాస్ ఆదా చేయడానికి ఈ ట్రిక్ ను ఫాలో అవ్వండి.

పగలు వంట చేసేటప్పుడు వంటగదిలోని లైట్లను ఆఫ్ చేయండి. దీనివల్ల శక్తి ఆదా అవుతుంది. అలాగే తెలియకుండానే గ్యాస్‌ వినియోగం కూడా తగ్గుతుంది. ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల గ్యాస్‌ సిలెండర్‌ కనీసం పది రోజులు అదనంగా వచ్చే అవకాశం ఉంది.

 

Exit mobile version