Ramadan 2025 fasting rules and tips for patients: ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. ఈ సమయంలో పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్నో శుభాలను ప్రసాదించే ఈ పవిత్ర రంజాన్ మాసంలో నిష్ఠగా ఉపవాసాలు ఆచరిస్తుంటారు. అయితే, ఉపవాస వ్రతం పాటించే ముందు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని సమక్షంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష సమయంలో పాటించాల్సిన ఆహార, ఆరోగ్య నియమాలపై ఆరోగ్య నిపుణులు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. వివిధ వ్యాధుల రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలిపారు. ఉపవాసం అంటే అల్లాహ్ కు దగ్గరగా ఉండటం. 30 రోజులపాటు రోజూ 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉండటం. ఈ ఉపవాసాలతో శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలై ఆరోగ్యాన్ని క్రమబద్ధీ కరిస్తాయి.
ఉపవాసాలతో శరీరం డీటాక్సిఫికేషన్ అయి చెడు, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలర్జీలతో కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. ఉపవాసాలతో పొట్టకు విశ్రాంతి లభిస్తుంది. నిద్రలేమి తగ్గి, శరీరంపై స్వీయ నియంత్రణ వస్తుంది. వ్యసనాల నుంచి దూరంగా ఉంటాం. మెదడు పనితీరు మెరుగవుతుంది. ఉపవాసాల వల్ల కొందరికి ఛాతీలో మంట, తలనొప్పి, నీటి కొరత, మలబద్దకం, ఒత్తిడి కలగవచ్చు. ఇలాంటి పరిస్థితులలో డాక్టర్ సూచన మేరకు మందులు వాడాలి. గుండె జబ్బులు, గుండె ఆపరేషన్లు జరిగిన వారు, 79 మాసాల గర్భంతో ఉన్నవారు, బాలింతలు, డయాలసిస్ రోగులు, కిడ్నీ రోగులు, నెలసరి రుతుస్రావంలో ఉన్నవా రు, మూర్ఛ వ్యాధి ఉన్నవారు, మతి స్థిమితం లేనివారు, ప్రయాణంలో ఉన్నవారు. మహమ్మద్ ప్రవక్త(స) ప్రకారం సహరిలో ఖర్జూరం తినడం అత్యుత్తమం. తగినన్ని నీళ్లు తాగాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగకూడదు. శరీరా నికి అవసరమైన మేరకు పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులను కలిగి ఆహారాన్ని తీసుకోవాలి. మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉన్న వంటకాలకు చాలా తక్కువగా తీసుకోవాలి. ఉపవాసం పూర్తయ్యాక కూడా ఖర్జూరాలను తినడమే మేలు. కూల్ డ్రింక్స్ కు బదులుగా పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. హలీమ్, హరీస్ కూడా తక్కువగా తీసుకోవాలి. రాత్రి భోజనానికి మాత్రం ఇంట్లో వండిన పదార్థాలు తీసుకోవాలి.
మధుమేహం, కాలేయం, జీర్ణ కోశ, ఆస్తమా, గుండె జబ్బులు, బీపీ, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు రంజాన్ ఉపవాసాలు పాటించాలి. మందులు వేసుకునే సమయాలను కూడా వైద్యుల సలహా మేరకు మార్చుకోవాలి. రంజాన్ ఉపవాసాలతో మూత్రపిండాల పనితనం మెరుగుపడి, అందుకు సంబంధించిన వ్యాధుల తగ్గినట్టు సౌదీలో చేసిన పరిశోధనలో వైద్యులు గమనించారు. అయితే కిడ్నీ రోగులు డాక్టర్ల సలహా తీసు కున్నాకే రమజాన్ ఉపవాసాలు చేయాలి. కిడ్నీ మార్పిడి జరిగిన వారు ఉపవాసాలు చేయకూడదు. రంజాన్ ఉప వాసాలు చేయాలనుకున్న నలభై ఏండ్ల పైబడిన వాళ్లం దరూ బీపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. రమజాన్ ఉపవాసాల వల్ల డిప్రెప్షన్, యాంగ్జయిటీ లాంటి మానసిక వ్యాధులు తగ్గుతాయి. రంజాన్ మాసంలో బరువు పెరగకుండా సాత్వికాహారాన్ని తీసుకోవాలి. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి.
వేసవి తాపాన్ని భరించడానికి చల్లని నీళ్లతో రెండు లేదా మూడుసార్లు స్నానం చేయడం మంచిది. సెహరీలో కొద్దిగా నీటిని తాగాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయట తిరగకపోవడమే ఉత్తమం. చిన్న పిల్లలు తాము కూడా ఉపవాసం ఉంటామని మారాం చేస్తారు. అలాంటి పిల్లలకు సగం రోజు ఉపవాసం ఉండేలా సాధన చేయించాలి. అదే టీనేజీ పిల్లలకైతే వారికి ఉపవాసం గురించి ముందుగానే వివరించి సాధన చేయించాలి. ఆ తర్వాత వారి ఇష్టప్రకారం ఉపవాసం ఉండమని చెప్పాలి. వారిపై ఆ వయసులో హార్మోన్ల ప్రభావం ఎక్కువ కాబట్టి పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోమని చెప్పాలి. హై రిస్క్ ఉన్న గర్భిణులు రంజాన్ ఉపవాసాలు ఉండకపోవడమే ఉత్తమం. మిగతావారికీ మినహాయింపు ఉంది. ఆరు నెలలలోపు వయస్సు కలిగిన పిల్లలు ఉన్న బాలింతలకు ఉపవాసాలు పాటించాల్సిన అవసరంలేదు. ఆరు నెలల కంటే ఎక్కువ వయస్సు శిశువులు ఉన్న బాలింతలు వారికి ఇష్టమైతే ఉపవాసాలు పాటించవచ్చు. కానీ పాలను ఉత్పత్తి చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో తేలికపాటి వ్యాయామాలు కూడా చేయవచ్చు.