Site icon Prime9

Health Tips: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా.. కారణం ఇదే కావొచ్చు ?

Health Tips

Health Tips

Health Tips: ప్రస్తుత కాలంలో బరువు పెరగడం అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి. కానీ ఇది అనేక విధాలుగా ఆరోగ్యానికి హానికరం. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి కాలక్రమేణా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు బరువు అదుపులో ఉంచుకోవాలని సలహా ఇస్తుంటారు. ఇదిలా ఉంటే.. బరువు తగ్గడం మాత్రం అంత సులభమేమీ కాదు.

ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. బరువు తగ్గలేకపోతున్నామని ఎవరో ఒకరు చెప్పడం మీరు వినే ఉంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా? బరువు తగ్గడానికి డైటింగ్ నుండి వ్యాయామం వరకు ప్రతిదీ ప్రయత్నించారా ? అయినప్పటికీ బరువు తగ్గలేకపోయారా ? అయితే ఇందుకు కాలేయ సంబంధిత సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు.

కాలేయ వ్యాధులకు, బరువు పెరగడానికి మధ్య సంబంధం ఏమిటి ?

మన శరీరంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే భాగాలలో ఒకటి. రక్తం నిర్విషీకరణ చేయడంలో.. హార్మోన్లను నిర్వహించడంలో.. పోషకాలను ప్రాసెస్ చేయడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొవ్వులను విచ్ఛిన్నం చేసి వాటిని శక్తిగా మార్చడంలో కూడా ఉపయోగపడుతుంది. అందుకే కాలేయ సమస్యలు మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

మీ కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు.. లేదా మీకు ఏదైనా కాలేయ సంబంధిత వ్యాధి ఉన్నప్పుడు బరువు తగ్గడం మీకు చాలా కష్టంగా మారుతుంది.

కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం:

లివర్ సమస్యల కారణంగా.. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇది కూడా హార్మోన్లు ప్రభావితం చేస్తుంది.

ఫలితంగా.. శరీరంలోని కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం కూడా బలహీనపడుతుంది. ఇది బరువు పెరిగడానికి కారణం అవుతుంది. అందుకే మీకు ఫ్యాటీ లివర్ లేదా మరేదైనా లివర్ సమస్య ఉంటే బరువు తగ్గడం కష్టం అవుతుంది.

ఇన్సులిన్ నిరోధకత సమస్య 

మీ కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు..శరీరంలో గ్లూకోజ్ పరిమాణం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. కాలేయ సంబంధిత వ్యాధులు ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనిలో శరీర కణాలు ఇన్సులిన్ హార్మోన్‌ను సరిగ్గా నిర్వహించలేవు. దీని కారణంగా.. రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి మీరు బరువు పెరగడానికి కారణం అవుతుంది.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, అంతర్లీన వ్యాధులపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా మీరు బరువు తగ్గకపోతే..డాక్టర్‌ను సంప్రదించి కాలేయ సంబంధిత పరీక్ష (LFT) చేయించుకోండి. ఇది కాలేయ సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. ప్రారంభంలోనే చికిత్స తీసుకుంటే.. కాలేయ వ్యాధి, బరువు రెండింటినీ నయం చేసుకోవచ్చు.

Exit mobile version
Skip to toolbar