Prime9

IRCTC Tour Package: బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.. అందుబాటులో టికెట్లు..!

IRCTC ARUNACHALA MOKSHA YATRA Tour package Full Details: యాత్రికులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. ‘అరుణాచలం మోక్ష యాత్ర’ పేరిట ఓ స్పెషల్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఇందులో 4 రాత్రులు, 5 పగళ్లు ఉండేలా యాత్రను డిజైన్ చేశారు. అరుణాచలంతో పాటు కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దర్శనం, పుదుచ్చేరిలో కొన్ని ప్రాంతాలు చూసేందుకు అవకాశం ఉంటుంది.

 

హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి ప్రతీ గురువారం రైలు అందుబాటులో ఉంటుంది. జూన్ 19 నుంచి టికెట్లను అందుబాటులో ఉంటాయని, టూర్ ముగిసిన తర్వాత అదే స్టేషన్‌లో దిగే అవకాశం ఉంటుంది. కాచిగూడలో ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్.17653 ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐదో రోజు తిరిగి ఉదయం 7.50 నిమిషాలకు కాచిగూడ చేరుకోనుంది.

 

తొలి రోజు బయలుదేరిన రైలు రెండో రోజు ఉదయం 11.05 నిమిషాలకు పుదిచ్చేరి చేరుకుంటుంది. అక్కడ కేటాయించిన ఓ హోటల్‌లో విశ్రాంతి తీసుకునేందుకు సమయం ఉంటుంది. ఆ తర్వాత అరోవిల్, అరబిందో ఆశ్రమం, బీచ్ ఎంజాయ్ చేయవచ్చు. ఆ రోజు రాత్రి పుదుచ్చేరిలోనే బస ఉంటుంది.

 

ఇక, మూడోరోజు మార్నింగ్ అల్పాహారం చేసిన అరుణాచలం బయలుదేరుతారు. అరుణాచలంలో హోటల్‌ వెళ్లిన తర్వాత కాసేపు బస చేసి అరుణాచలేశ్వర ఆలయం వద్దకు చేరుకుంటారు. ఇఖ్కడ గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వారు చేసేందుకు అవకాశం ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక అక్కడే హోటల్‌లో బస చేస్తారు.

 

ప్యాకేజీ ఛార్జీల విషయానికొస్తే.. కంఫర్ట్ క్లాస్‌లో ఒక్కో వ్యక్తికి రూం ట్విన్ షేరింగ్‌లో డబుల్ ఉంటే రూ.20,060, ట్రిపుల్ షేరింగ్ ఉంటే రూ.15,610 ఉంటుంది. ఇందులో 5- 11 ఏళ్లచిన్నారులకు బెడ్ కావాలనుకుంటే రూ.11,750, బెడ్ అవసరం లేకుంటే రూ.9,950 గా ఉంది. ఇందులో నలుగురు లేదా ఆరుగురు ఉంటే డబుల్ కోసం రూ.16,390, ట్రిపుల్ కోసం రూ.14,110గా నిర్ణయాంచారు. మిగతా వివరాలకు https://www.irctctourism.com/ వెబ్ సైట్ లింక్ క్లిక్ చూడచ్చు.

 

Exit mobile version
Skip to toolbar