Site icon Prime9

Hiccups: ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి

Hiccups

Hiccups

Hiccups: చాలా మందికి భోజనం చేసేటప్పుడు, లేదా మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా ఒక్కసారిగా ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటాయి. ఇంకొంతమందికి ఒకసారి ఎక్కిళ్లు వచ్చాయి అంటే రోజంతా ఉంటాయి. ఎగ శ్వాస వచ్చి కొన్ని సార్లు బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కూడా. అయితే ఎక్కిళ్లు అనేవి చాలా సహజంగా జరుగుతాయి.. వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనుషులకు వాటి పై కంట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది. డయాఫ్రమ్ ఎక్స్పాండ్ అవడం వలన ఇలా ఎక్కిళ్లు ఎక్కువగా వచ్చి చాలా అన్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం మంది ఎక్కిళ్ల వలన చాలా ఇబ్బంది పడతామని చెప్తుంటారు.

ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి?

నీళ్లు కొద్దికొద్దిగా తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
గాలిని బిగబట్టడం వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది
పుల్లటి నీళ్లు నోట్లో పోసుకొని కాస్త పుక్కలించి కొద్ది కొద్దిగా నీళ్లు తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే కూడా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందుతారు
నోట్లో కాస్త పంచదార వేసుకొని చప్పరించడం వల్ల కూడా కొంత ఉపశమనం దొరుకుతుంది
నిమ్మరసం గానీ ఏదైనా పుల్లటి పదార్థాన్ని నాలుక మీద పిండి చప్పరించినా.. లవంగం బుగ్గన పెట్టుకున్నా కానీ ఎక్కిళ్లు తగ్గుతాయి.
గోరువెచ్చటి పాలలో పంచదార వేసి తీసుకున్నా.. జామ పండ్లు తిన్నా కూడా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది
అయితే కొన్నిసార్లు ఏం చేసినా ఎక్కిళ్లు తగ్గవు. అలాంటప్పుడు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

ఎక్కిళ్లు ఎందుకు వస్తాయంటే..?

కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల ఎక్కిళ్లు వస్తుంటాయంట

శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావడం, గ్యాస్ ట్రబుల్తో పొట్ట పట్టేసినట్టు ఉన్నప్పుడు డయాఫ్రేమ్ పై ఒత్తిడి పడి ఎక్కిళ్లు వచ్చే ఛాన్స్ ఉంది

ఐస్ చూయింగ్ గమ్ లాంటివి తింటున్నప్పుడు గాలి శ్వాసనాళంలోకి కాకుండా కడుపులోకి వెళ్లటం.

ఫాస్ట్ గా తినడం స్పీడ్ గా నీల్లు తాగటం ఇలా చాలా కారణాలుంటాయి

 

Exit mobile version