Prime9

Sapota benefits: సపోటాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం

Sapota benefits: మనలో సపోటా పండ్లను ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. సపోటా పండ్లలో ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, బి, సి మనకి అధికంగా దొరుకుతాయి. డాక్టర్లు కూడా హ్యాపీగా తినండని సలహా ఇస్తుంటారు. తినమని తియ్య తియ్యగా సపోటా పళ్ళు తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇక్కడ చదివి తెలుకుందాం.

1.విటిమిన్ C:
ఈ సపోటాలో ఉండే విటిమిన్ సి మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

2.మల బద్దక సమస్యలు:
మల బద్ధక సమస్యలు ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల కడుపు మొత్తాన్ని శుభ్రం చేసి మీకున్న సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.

3.ఎముకలు:
వీటిని రోజు తీసుకోవడం వలన ఎముకలు బలంగా అవుతాయి. సపోటాలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఎముకలు బలంగా మారేలా ఇవి తోడ్పడుతాయి.

4.బ్లడ్ ప్రెజర్:
ఇవి రక్త నాలాల పని తీరును మెరుగుపరుస్తుంది.
రక్తం తక్కువ ఉన్న వారు వీటిని తీసుకోవడం వలన రక్తం పెరుగుతుంది.

5.బరువు తగ్గడం:
బరువు తగ్గాలనుకొనే వారు రోజుకు ఒక సపోటా తింటే చాలు. రోజు రోజుకు ఎంత బరువు తగ్గుతున్నారో మీకే తెలుస్తుంది.

6.ముఖం పై మచ్చలు:
ముఖం పై మచ్చలు వల్ల బాధ పడుతున్నారా, ఐతే ఒకసారి సపోటాలు తిని చూడండి. మీ ముఖం పై మచ్చలు తగ్గు ముఖం పట్టి మీకు మంచి సౌదర్యాన్ని ఇస్తుంది.

Exit mobile version
Skip to toolbar