Prime9

Happy Fathers Day: పిల్లల కోసం అలుపెరగని పోరాటం చేసే యోధుడికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు!

Happy Fathers Day: ఫాదర్స్ డే అంటే కేవలం క్యాలెండర్‌లో తేదీ మాత్రమే కాదని.. మనల్ని పెంచడంతో పాటు నిరంతరం రక్షణ కవచంలా, మార్గనిర్దేశం చేస్తూ, తడబడకుండా ఇచ్చే ధైర్యమే నాన్న. అమ్మది ఆప్యాయత అయితే.. నాన్నది బాధ్యత. హ్యాపీ ఫాదర్స్ డే.

 

తొలి అడుగుల నుంచి ఆకాశన్నంత ఎగిరేంత వరకు తన జీవితం మొత్తం అర్పించే వ్యక్తి నాన్న. ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, బాధ్యతలు తాను భరిస్తూ పిల్లలకు మాత్రం సంతోషాన్ని పంచుతాడు. పిల్లలపై కొండంత ప్రేమ గుండెల్లో దాగి ఉన్నా తన అంతరంగాన్ని బయటకు చూపించడు. పైకి కఠినంగా కనిపించే నాన్న రియల్ హీరో.

 

నాన్న అనే రెండు అక్షరాల పదం నిస్వార్థమైన ప్రేమకు ప్రతిరూపం. నాన్న అనే పిలుపులో ఓ ఎమోషన్ ఉంటుంది. నాన్న ఎంత కఠినంగా ఉన్నా గుండెల నిండా పిల్లలు, కుటుంబమే నిండి ఉంటుంది. నిరంతరం పిల్లల బంగారు భవిష్యత్ కోసమే పరితపిస్తూ ఉంటాడు. పిల్లల విజయమే తన విజయమని మురిసిపోతాడు. పిల్లల కోసం అలుపెరగని పోరాటం చేసే యోధుడు నాన్న.

 

ఇదిలా ఉండగా, ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియలో చాలా కోట్స్ పోస్ట్ చేస్తున్నారు. మీరే రియల్ హీరో.. కష్టం, క్రమశిక్షణ, విలువ నేర్పిన మహోన్నత వ్యక్తి నాన్న.. నీ త్యాగాలకు ఏం చెప్పిన తక్కువే నాన్న.. నాన్న నువు నా ప్రాణం.. థ్యాంక్స్ నాన్న… అంటూ కొటేషన్స్ షేర్ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar