Prime9

Coconut Water Benefits: కొబ్బరిబోండంతో ఆరోగ్యానికెంతో మేలు, సమ్మర్ లో మరీ మంచిది

coconut water benifits in telugu news

coconut water benefits in Telugu news

గుండె ఆరోగ్యాన్ని కాపాడే అమృతపానియం కొబ్బరినీళ్లు
కొబ్బరి బోండంలోని నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. రక్త సరఫరాలో తొడుంటుంది. శరీరంలోని పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడంలో కొబ్బరినీళ్లకు మించినది ఏదీ లేదనే చెప్పాలి. వీటిలో ఉంటే ఎలక్ట్రోలైట్ల కారణంగా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని కాపాడుతాయి. కొబ్బరి నీళ్లలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. చెడు బ్యాక్టీరియాను బయటకు పంపించడంలో తోడ్పడుతుంది.

coconut water benifits in telugu 1

coconut water benifits in telugu 1

మరి మంచి కొబ్బరి బోండాన్ని ఎంచుకోవడం ఎలా
కొబ్బరి నీరు తాగడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. కొబ్బరి బోండాలు అన్ని ఒకే రకంగా కనిపించినా కొన్నింట్లో ఎక్కువ నీరు మరికొన్నింట్లో తక్కువ నీళ్లు ఉంటాయి. అయితే వీటిలో ఎక్కువ నీళ్లు ఉన్న బోండాన్ని గుర్తించడం ఎలా అనేవిషయంలోనే చాలా మంది అయోమయంలో పడతారు. ఇప్పుడు మనం ఎక్కువ నీళ్లు ఉన్న కొబ్బరి బోండాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్లు సాధారణంగా కొత్త కాయల్లో ఎక్కువగా ఉంటుంది. అవి చూడటానికి పైకి పచ్చిగా కనిపిస్తాయి. ఇందులో నీళ్లు ఎక్కువగా ఉంటుందని రైతులుకూడా చెబుతున్నారు. ఆకు పచ్చ కలర్ నుంచి పసుపు రంగులోకి మారినట్లయితే అందులో నీళ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. కొబ్బరి బోండం గుండ్రంగా ఉండి పైకి పచ్చిగా ఉంటే అందులో కొబ్బరి తక్కువ నీళ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. సాధారణంగా మీడియం సైజ్ ఉన్నవాటిని గనుక తీసుకుంటే అన్నీ సమపాళ్లలో ఉంటాయి.

coconut water benefits

కొబ్బరి బోండాన్ని ఊపి చూసినట్లయితే అందులో నంచి శబ్ధం వచ్చినట్లయితే అందులో నీరు కొంచె తక్కువ ఉన్నట్లు. ఈ సూత్రం ప్రార్థనా స్థలాలలో దేవుడికి కొట్టే కొబ్బరికాయకు కూడా వర్థిస్తుంది.

 

వారానికి రెండు సార్లు కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు,   జీర్ణాశయానికి సంబంధించిన ఏదైనా వ్యాధితో బాధ పడుతుంటే డాక్టర్ సలహామేరకే వాడాలి.

 

గమనిక: కొబ్బరిబోండం గురించిన వివరాలు సాధారణమైనవే మేము ఇక్కడ ప్రస్తావించాము. అన్ని ఆహార పదార్థాలు తీసుకుంటూ కొబ్బరిబోండం తాగితే కలిగే లాభాన్ని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇది ఏవిధమైన చికిత్సకు సంబంధించింది కాదు.   మరింత అవగాహన కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. ప్రైమ్ 9 న్యూస్ చానల్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. కేవలం విషయాన్ని మాత్రమే చేరువ చేస్తోంది. ఖచ్చితమైన రిజల్ట్స్ కు చానల్ బాధ్యత వహించదు.

 

Exit mobile version
Skip to toolbar