High Blood Pressure: హైబీపీ అంటేనే చాలామంది హడలిపోతారు. ఎందుకంటే.. దాని తీవ్రత మనిషిపై ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి బీపీ ఎక్కువ కావడం వలన రక్త నాలాల్లో రక్త ప్రసరణ పెరిగి నాలాలు చిట్లిపోతాయి. దీంతో పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బీపీని ఎక్కువకాకుండా చూసుకోవాలి. అందుకు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వాటిని జీవితంలో భాగం చేసుకోవడంవలన లైఫ్ మారిపోతుంది.

tips to control high blood pressure
హైబీపీని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. బీపీ పెరగడం వలన గుండె వేగం పెరుగుతుంది. దీంతో మనిషి జీవితానికి త్రెట్ వస్తుంది. కావున ఎప్పటికప్పుడు రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవాలి. సాధారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండటానికి కారణం ఉప్పు ఎక్కువగా తినడం, సమస్య వచ్చినప్పుడు ఒత్తిడికి లోనవడం. వీటిని పరిష్కరించడానికి డాక్టర్లు కొన్నింటిని సూచించారు.
యోగా లేక వ్యాయామం..
ప్రతీ రోజు 15 నుంచి 30 నిమిశాలపాటు సాధారణ వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేసుకోవాలి. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ చాలా మంచింది. దీంతో ప్రెజర్ తగ్గుతుంది.
ఆహార నియమాలు..
ఆహారంతో చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ అయితే తప్పకుండా తినాలి. అప్పుడే ఏకాలానికి అవసరమైన డైట్ శరీరానికి అందుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, చిలగడదుంపలు, పాలకూర టమాటాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి హై బీపీని తగ్గిస్తుంది.

tips to control high blood pressure
ఒత్తిడిని తగ్గించాలి.. బరువును కంట్రోల్ లో ఉంచాలి…
బరువు ఎక్కువ ఉంటే అది శారీరకంగా ఎంతో ప్రభావం చూపుతుంది. కాబట్టి బరువును సరిగ్గా మెయింటేన్ చేయాలి. అందుకు జొన్న రొట్టె, ఓట్స్, గోదుమ రొట్టె, వాటిని ఆహారంలో చేర్చాలి. ఒత్తిడి తగ్గడానికి ప్రతీరోజు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయాలి.
రోజుకు 8గంటల నిద్ర
ఒత్తిడిని తగ్గించే భాగంలో ప్రతీరోజు ఎనిమిది గంటలనిద్ర ప్రతీ మనిషికి అవసరం. ఒకే టైమ్ కు పడుకుని ఒకే టైమ్ కు లేచి యోగా చేయడం ఎంతో ఉత్తమం. యోగా చేయడం వలన శరీరంలోని ఫ్యాట్ తగ్గుతుంది. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ యోగా చేసి మిత ఆహారం తీసుకోవడం వలన హైబీపీకీ వీడ్కోలు పలకవచ్చు.
గమనిక.. ఇది కేవలం అవగాహన కోసమే. ఏ మెడిసిన్ కు ప్రత్యమ్నయం కాదు. రోజువారి ఆహారపు అలవాట్లలో మాత్రమే వాడుకోవాలి. అయితే వాడేముందు ఆయుర్వేద, అల్లోపతి డాక్టర్లను సంప్రదించగలరు. ఖచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.