Prime9

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్ తో ముఖంపై మచ్చలు మాయం

 

Beetroot Face Pack For Glowing Skin: కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అలాగే కాదేదీ అతివల అందసంరక్షణకు అడ్డం అన్నట్లుంది. అతివలు ముఖ సౌందర్య రక్షణకు ఈ ప్రపంచంలో లేని చిట్కా అంటూ లేదు. అందులో భాగంగానే ఇప్పుడు మనం బీట్రూట్ తో ఎలా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చో, చేసుకోవచ్చో చూద్దాం. ముఖంపై ఏర్పడిన మచ్చలు, ట్యాన్ పోవాలంటే బీట్ రూట్ ఫేసియల్ తప్పనిసరని అంటున్నారు నిపుణులు. ఇది సహజంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి క్రీమ్ వాడాల్సిన అవసరం లేదు.

 

 

అందమైన ముఖం మచ్చలు లేకుండా ఉండేందుకు బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా తక్కువ ఖర్చుతో సమకూరుతుంది. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఓ మీడియం సైజ్ బీట్ రూట్ ను తీసుకుని పీల్ చేపుకుని ( పొట్టును తరగాలి) ముక్కలుగా కట్ చేయాలి. దీన్ని మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ బీట్ రూట్ జ్యూస్ చర్మానికి అందంగా ఉండేలా నల్లటి మచ్చలు పోయేలా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు, విటమిన్స్ ఉంటాయి.

 

 

బీట్ రూట్ జ్యూస్ లో కాఫీ పౌడర్ కలిపి…
బీట్ రూట్ జ్యూస్ లో ఒక టీ స్పూన్ పరిమాణంలో కాఫీ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా ముఖానికి అఫ్లై చేయండి. 15నిమిషాల వరకు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగివేయాలి. ఇది చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ను దూరం చేస్తుంది. కాఫీ పౌడర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడతాయి. కాఫీపౌడర్ లో సహజమైన ఎక్స్ ఫోలియేటింగ్ గుణాలు ఉండటంవలన నల్ల మచ్చల్ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎండ నుంచి చర్మాన్ని కాపాడతాయి.

 

 

బీట్ రూట్ లో బియ్యం, శనగ పిండి కలిపి..
బీట్ రూట్ జ్యూస్ లో ఒక టీస్పూన్ శనగపిండి, బియ్యంపిండి వేసి ప్యాక్ లా ముఖానికి అప్లై చేయాలి. దీనిని 15నిమిషాల వరకు అలాగే ఉంచి ఆతర్వాత క్లీన్ చేయాలి.

 

గమనిక.. ఇది కేవలం అవగాహన కోసమే. ఏ మెడిసిన్ కు ప్రత్యమ్నయం కాదు. ఖచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.

Exit mobile version
Skip to toolbar