Site icon Prime9

Beauty Tips: నల్లని మచ్చలు పోగొట్టే చిట్కాలు

black spots prime9news

black spots prime9news

Beauty Tips: మనలో చాలా మంది ముఖం పై నల్ల మచ్చలు ఉన్నాయని భాధ పడుతూ ఎప్పుడు ఏదో ఒక క్రీమ్ ముఖానికి రాస్తూనే ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలా మంది పైకి చెప్పు కోకుండా లోలోపల బాధ పడుతుంటారు. అసలు ఎందుకు ఇలా అవుతుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు.బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో వేడి ఎక్కువయ్యి అ ప్రభావం వెంటేనే కళ్ళ మీద చూపిస్తుంది. ఎన్ని వాడిన తగ్గడం లేదా ఈ రెండు చిట్కాలను పాటించండి.

బంగాళా దుంప తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు. ఒక బంగాళదుంప తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసి , మూడు స్పూన్ రసాన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు వాటిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి .ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని మీ కళ్ళ క్రింద , కళ్ళ పై భాగంలో రాసిన తరువాత 5 నిముషాలు పాటు ఉంచి తరువాత ముఖాన్ని మంచిగా శుభ్రం చేసుకోండి.

పగటిపూట మనం ఖాళీ గానే ఉంటాం. ఆ సమయంలో కీరా ముక్కలు కళ్లమీద పెట్టుకుని కొంత సమయం వరకు అలాగే ఉంచుకోవాలి. ఇలాగే రాత్రిపూట కూడా ఒకసారి చేయండి. ఇలా చేయడం వలన కళ్ళ క్రింద నల్లని వలయాలు, మచ్చలు ఉంటే తొందరగా తగ్గుతుంది.ఈ రెండు చిట్కాలను పాటించండి. ఆ తరువాత రిజల్ట్ మీకే తెలుస్తుంది.

Exit mobile version