Site icon Prime9

Toxic: రాకీ భాయ్ ‘టాక్సిక్’ ఆగిపోయిందా..? మేకర్స్ ఏమంటున్నారు..?

Toxic

Toxic

Toxic: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి  చెందిన కొందరు తారలు తెలుగు సినీ ప్రేమికుల హృదయాల్లో కూడా తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ స్టార్లలో ఒకరు యష్. కేజీఎఫ్ చిత్రంలో యష్ పవర్ ఫుల్ యాక్షన్, నటన చూసి అందరూ అతనిని అభిమానించారు. కేజీఎఫ్ తర్వాత యష్‌ని మరిన్ని యాక్షన్ చిత్రాలలో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ఆయన తన ‘టాక్సిక్’ సినిమాతో రెచ్చిపోనున్నాడు. అయితే ఆ సినిమా కోసం యష్ అభిమానులు మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

యష్ సినిమా ‘టాక్సిక్’ ఎందుకు ఆగిపోయింది?
యష్ సినిమా ‘టాక్సిక్’కి సంబంధించి ఆ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓ నివేదిక ప్రకారం యష్ చిత్రం ‘టాక్సిక్’ ఆగిపోలేదు, కానీ దాని నిర్మాణం ఆలస్యం అవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుండి ఎటువంటి ప్రకటన లేదా సమాచారం బయటకు రాలేదు.

యష్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమా
యష్ రాబోయే చిత్రం KGF 2 బడ్జె కంటే రెట్టంపు ఖర్చుతో కూడుకున్నదని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ చిత్రం యష్ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లీ చిత్రంగా ఉంటుంది. యష్‌ నటిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనుంది. గోవాలో నడిచే డ్రగ్స్ ముఠా చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది.

సినిమాలోని మిగిలిన నటీనటుల గురించి మాట్లాడితే ఈ చిత్రంలో యష్‌తో కియారా అద్వానీ కనిపించవచ్చు. ఇది కాకుండా హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, శృతి హాసన్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. టాక్సిక్ కాకుండా రణ్‌బీర్ కపూర్ చిత్రం రామాయణంలో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రంలో రామ్ పాత్రలో రణబీర్ కపూర్ నటించనున్నాడు.

Exit mobile version