Site icon Prime9

White Hairs: 20 ఏళ్లకే తెల్ల జుట్టు వస్తుందా? అయితే ఇలా చేస్తే మళ్లీ రానే రాదు!

White Hairs causes and Prevention: వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లగా మారడం సహజమే. అయితే ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత కనిపించే తెల్ల జుట్టు.. ఇప్పుడు 20 ఏళ్ల లోపు ఉన్న వారిలో కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఇలా చిన్న వయసుల్లోనే తెల్లజుట్టు రావడంతో చాలామంది తెల్ల జుట్టు కనిపించకుండా నలుపు రంగు కలర్ తో మేనేజ్ చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానుగుణంగా వచ్చిన మార్పులు, సరైన పోషకాహారం, జీవనశైలి ఆధారంగా జుట్టు తెల్లగా మారుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

శరీరంలో ఉండే మెలనిన్ అనే హార్మోన్ తగ్గడంతో చిన్న వయసులో జుట్టు తెల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ హార్మోన్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే కొంతమందిలో ఈ హార్మోన్ ముందుగానే తగ్గిపోతుంది. మరోవైపు ఫోలిక్ యాసిడ్, బయోటిన్ వంటి పోషకాల లోపంతో కూడా జుట్టు తెల్లగా మారేందుకు అవకాశం ఉంది.

మధుమేహం మాదిరిగానే చిన్న వయసులో జుట్టు సమస్యలు వంశపారంపర్యంగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ వంశపారంపర్యంగా జుట్టు రాలడం వంటి సమస్య ఉంటే భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని అలవాట్ల కూడా జుట్టు కలర్ మారుతోంది. ముఖ్యంగా ధూమపానం, ద్యపానం ఎక్కువగా తీసుకోవడం కారణంగా ఆక్సీకరణ ఒత్తిడికి గురై కూడా జుట్టు రాలడం, కలర్ మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడికి గురికావడంతో శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒత్తిడి కారణంగా ఆందోళన, నిద్రలేమి సమస్యలకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితులు జుట్టుపై ప్రభావం చూపడంతో జుట్టు రాలడం లేదా వెంట్రుకలు తెల్లగా మారేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జుట్టుకు ఉపయోగించే లోషన్స్ ఆధారంగా కూడా తెల్లగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉండే సల్పేట్ల కారణంగా జట్టు పొడిబారడంతోపాటు త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో తొందరగా జుట్టు తెల్లగా మారుతోంది. అందుకే హెయిర్ ప్రొడక్ట్స్ లో సల్పేట్లు లేనివి ఎంచుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.

తెల్ల జుట్టు నివారణకు సరైన పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఐరన్, రాగి, విటమిన్స్, జింక్ వంటి పోషకాలు అందేలా చూసుకోవాలి. దీంతో పాటు ఒత్తిడిని జయించాలి. ఆల్కహాల్, సిగరెట్, హుక్కా వంటి వాటికి దూరంగా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లతో తెల్ల జుట్టు సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ సమస్య తగ్గని యెడల వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version
Skip to toolbar