Site icon Prime9

WhatsApp New Feature: వాట్సాప్ అప్‌డేట్ చేయండి.. అద్భుతమైన ఫీచర్ వచ్చేసింది!

whatsapp new features

whatsapp new features

WhatsApp New Feature: ప్రముఖ చాటింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన మిలియన్ల మంది వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఇటీవల కంపెనీ స్టేటస్ సెక్షన్ కోసం అత్యంత ప్రత్యేకమైన ఫీచర్‌ను డిజైన్ చేసింది. దీని సహాయంతో మీరు ఇన్‌స్టాగ్రామ్ లాగా స్టోరీలో మీ కాంటాక్ట్‌లలో దేనినైనా ట్యాగ్ చేయవచ్చు. ఇప్పుడు కంపెనీ తన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కోసం అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది.

అదేటంటే ఈసారి కంపెనీ ఇన్‌బాక్స్‌ను మరింత అందంగా మార్చడానికి పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేసింది. చాలా కాలంగా టెస్టింగ్‌లో ఉన్న చాట్ థీమ్ ఫీచర్‌ను కంపెనీ ఈసారి పరిచయం చేసింది. ఇప్పుడు చివరకు 20 కొత్త థీమ్‌లతో విడుదల చేసింది. అయితే ప్రస్తుతం మీరు ఈ ఫీచర్‌ని iOS డివైస్‌లలో అంటే iPhoneలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కంపెనీ ఇంకా ఈ అప్‌డేట్ విడుదల చేయలేదు. ఈ ఫీచర్ వినియోగదారులు తమ చాట్‌లను డిఫరెంట్ కలర్స్, వాల్‌పేపర్‌లతో కస్టమైజ్ చేయచ్చు. ఇది మీ చాటింగ్‌ను మరింత సరదాగా చేస్తుది.

కొత్త థీమ్ ఫీచర్‌తో యూజర్లు 22 విభిన్న థీమ్‌లు, 20 కలర్స్ కలిగి ఉంటారు. తద్వారా వారి ఇష్టానుసారం చాట్‌లను కస్టమైజ్ చేయచ్చు. వినియోగదారులు అన్ని చాట్‌లకు వర్తించే డిఫాల్ట్ థీమ్‌ను ఎంచుకోవచ్చు లేదా నిర్దిష్ట చాట్ కోసం వేరే థీమ్‌ను ఎంచుకోవచ్చు. థీమ్ సెట్టింగ్‌లు మీ ఫోన్‌లో మాత్రమే కనిపిస్తాయి. అంటే మీరు వారి చాట్‌లో ఏ థీమ్‌ను అప్లై చేస్తారో అవతలి వ్యక్తికి తెలియదు.

ఈ ఫీచర్ వినియోగదారులు తమ చాట్‌లను మరింత మెరుగుపరుచుకోవడానికి, వారి ఇష్టానుసారం వాటిని కస్టమైజ్ చేయడానికి అనుమతిస్తుంది. విభిన్న థీమ్‌లు, రంగులతో, వినియోగదారులు తమ మెసేజ్ అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా చేయవచ్చు.

WABetaInfo నివేదిక ప్రకారం ఈ ఫీచర్ త్వరలో వినియోగదారులందరి ఫోన్లలో ఈ ఫీచర్ వస్తుంది. భవిష్యత్తులో వాట్సాప్ ఈ ఫీచర్‌కు యానిమేటెడ్ థీమ్‌లు లేదా థీమ్‌ను కస్టమైజ్డ్ వంటి మరిన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తుంది.

Exit mobile version