Site icon Prime9

Vivo Y300+: వివో కొత్త ఫోన్.. ఫీచర్స్ సూపరో సూపర్.. ప్రైస్ చూస్తే వదలరుగా!

Vivo Y300+

Vivo Y300+

Vivo Y300+: స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. Vivo Y300+ పేరుతో రిలీజ్ చేయనుంది. ఫోన్ మోడల్ నంబర్ V2422. ఫోన్ లాంచ్ తేదీ గురించి కంపెనీ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈ ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ఓ టెక్ ప్రియుడు తెలిపారు. అయితే టిప్‌స్టర్ ఈ రాబోయే ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను లీక్ చేశాడు. దీని కారణంగా వినియోగదారుల ఉత్సాహం చాలా పెరిగింది. ఈ ఫోన్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 44W ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానుందని వెల్లడించాడు. ఈ ఫోన్ లీక్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

లీక్ ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌లో ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల OLED డిస్‌ప్లేను అందించబోతోంది. డిస్‌ప్లే డిజైన్, రిఫ్రెష్ రేట్ గురించి ఇంకా సమాచారం వెల్లడి కాలేదు. బయోమెట్రిక్ భద్రత కోసం కంపెనీ ఈ ఫోన్‌లో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనుంది. ఫోన్ 8 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చ.

ప్రాసెసర్‌ా మీరు స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌ను చూడవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌కు LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ అందించే అవకాశం ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉండొచ్చు. సెల్ఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకురానుంది.

OS గురించి మాట్లాడితే ఫోన్ Android 14 ఆధారంగా Funtouch OS 14తో రావచ్చు. ఫోన్ బ్యాటరీ 5000mAhగా ఉంటుంది. ఈ బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా అందించగలదు. ఫోన్ ధర రూ.23,999. మరికొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version