Site icon Prime9

Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకీ మామ కొత్త మూవీ

Venkatesh Movie Title Sankranthiki Vasthunam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో మరో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ – 2, ఎఫ్ – 3 సినిమాలు విడుదలై కామెడీ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో కొత్తగా వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, మూడో సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు టైటిల్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో ఇద్దరి హీరోయిన్ల మధ్యలో వెంకటేష్ నిల్చున్న ఫోటోను మేకర్స్ పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటుండడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీగా అవుతున్నారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను గుర్తు చేసిందని, ఈ సినిమా తరహాలోనే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్.. ప్రియురాలిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందించారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ అని టైటిల్ పిక్స్ చేసి డేట్ పిక్స్ చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి విడుదల ఖరారు కావడంతో వెంకటేష్ మూవీని వాయిదా వేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవ్వన్నీ రూమర్స్ మాత్రమేనని, వాయిదా పడే అవకాశం లేదని మరికొందరి చెబుతున్నారు. ఏదీ ఏమైనా టైటిల్ మాత్రమే పిక్స్ చేసి డేట్ చెప్పకపోవడంతో పండగకు రిలీజ్ చేస్తారా ? లేదా? అనే సస్పెన్స్‌గానే నెలకొంది.

Exit mobile version