Vastu Tips : సంతానోత్పత్తి సమస్యలకు చెక్ పెట్టే వాస్తు చిట్కాలు..

జులు మారుతున్న.. మనుషులు మారుతున్నప్పటికి కూడా కొన్ని మాత్రం మారవు అని చెప్పడంలో సందేహం లేదు. వబతిలో ముఖ్యంగా మన ఆచారాలు, సాంప్రదాయాలు.. మన శాస్త్రాలు వాటికి మనం ఇచ్చే విలువ అటువంటిది. కాలంతో పోటీ పడుతూ మార్పు చెందుతున్నప్పటికి ఇల్లు, కార్యాలయాలు, పెద్ద పెద్ద భవంతులు కట్టేటప్పుడు ఖచ్చితంగా వాస్తు చూస్తారు.

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 08:18 AM IST

Vastu Tips : రోజులు మారుతున్న.. మనుషులు మారుతున్నప్పటికి కూడా కొన్ని మాత్రం మారవు అని చెప్పడంలో సందేహం లేదు. వబతిలో ముఖ్యంగా మన ఆచారాలు, సాంప్రదాయాలు.. మన శాస్త్రాలు వాటికి మనం ఇచ్చే విలువ అటువంటిది. కాలంతో పోటీ పడుతూ మార్పు చెందుతున్నప్పటికి ఇల్లు, కార్యాలయాలు, పెద్ద పెద్ద భవంతులు కట్టేటప్పుడు ఖచ్చితంగా వాస్తు చూస్తారు. ఏ దిక్కులో ఏది ఉండాలన్నది పక్కాగా ప్లాన్ చేస్తారు. వాస్తు దోషాల కారణంగా ఇంటిల్లిపాది సమస్యలు ఎదుర్కొంటారని.. ఆరోగ్య సమస్యలు వస్తాయని పండితులు వివరిస్తున్నారు. వాస్తు దోషాలు, గదుల స్థానం వల్ల కూడా సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది ని వివరిస్తున్నారు. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకోసం ప్రత్యేకంగా..

సంతానోత్పత్తి సమస్యలకు వాస్తు చిట్కాలు (Vastu Tips)..

  • వివాహిత జంట ఎప్పుడూ బెడ్‌రూములో ఆగ్నేయ భాగంలోనే పడుకోవాలి. ఎందుకంటే అది అగ్ని మూలకంతో అనుసంధానించబడి ఉంటుంది. ఇది మంచి శృంగార జీవితాన్ని కలిగి ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
  • ఎల్లప్పుడూ మీ తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉంచే నిద్రపోవాలి. తల పడమర వైపు, పాదాలు తూర్పు వైపు ఉంచినా మంచిదే.
  • బెడ్‌రూము లోపల అందమైన ల్యాండ్ స్కేప్‌లు, పెయింటింగ్‌లు, చిన్న పిల్లల ఫోటోలు అంటించవచ్చు.. ఇది కళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
  • సువాసనగల పువ్వులను కూడా పడకగదిలో ఉంచుకోవచ్చు.
  • మీ భర్త/భార్యని గుర్తు చేసే వస్తువులను కనిపించే చోట పెట్టుకోవాలి.
  • బెడ్‌రూములో నాణ్యమైన సమయాన్ని గడపాలి. బెడ్రూమ్ అంటే దంపతులది. అక్కడ మీకు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించుకోవాలి.
  • గర్భిణీ స్త్రీలు బిడ్డపై ఆశావాద ప్రభావాన్ని చూపుతారు కాబట్టి గర్భధారణ సమయంలో ప్రేరణాత్మక సినిమాలు చూడటం, మంచి పుస్తకాలు, మ్యాగజైన్‌లు చదవడం మంచిది.

(Vastu Tips) గర్భం దాల్చినప్పుడు చేయకూడని పనులు..

  • పడక గదిలో ఎలక్ట్రానికి గాడ్జెట్స్‌ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. వాటి నుండి వెలువడే లైట్ వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.
  • పడకగదిలోని అద్దం ఎప్పుడూ మంచానికి ఎదురుగా ఉండకూడదు. ఎందుకంటేదాని ప్రతిబింబం నిద్ర విధానాలకు భంగం కలిగించడమే కాకుండా లైంగికతపై ప్రభావం చూపుతుంది.
  • గర్భిణీలు ముదురు ఎరుపు, నలుపు మరియు ఆరెంజ్ వంటి ముదురు రంగులను ధరించవద్దు. పాస్టెల్ ఆకువచ్చ, నీలం, పసుపు, తెలుపు వంటి లైట్ కలర్స్ వేసుకోవచ్చు.
  • బెడ్‌రూములో హింస, యుద్ధం, డ్రాగన్‌లు లేదా ఏదైనా ప్రతికూల అంశాల పెయింటింగ్‌లను ఉంచవద్దు. ఉంటే తీసేయడం మంచిది.
  • దంపతుల మధ్య నిరాశావాదాన్ని ప్రభావితం చేసే ఏవైనా భావాలు ఉంటే పడకగది బయటే చూసుకోవాలి.
  • రౌండ్ మ్యాట్రెస్ వాడకపోవడం ఉత్తమం.
  • పెళ్లి అయిన కొత్త జంటలు బెడ్‌రూములోని ఈశాన్య మూలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. ఆ మూలలో ఎలాంటి వస్తువులు పెట్టవద్దు. బరువైన వస్తువులను అక్కడ ఉంచవద్దు.. బెడ్‌ లేదా, స్లీపింగ్ సోఫాను ఆగ్నేయ మూలలో మాత్రమే ఉంచాలి.

ఈ వాస్తు చిట్కాలను ఉపయోగించి సంతానోత్పత్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.