Vastu Tips : జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు అని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా..
తులసి చెట్టుని తాకడం..
మనలో చాలా మంది ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది. నిత్యం తులసి పూజ చేసే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత సంధ్యా వేళలో తులసిని తాకడం, తులసి ఆకులను తెంచడం వంటివి చేయకూడదట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట.
చీపురు వాడరాదు..
వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ సూర్యుడు అస్తమయం అయిన తర్వాత చీపురును పొరపాటున కూడా వాడరాదట. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంగా పరిగణిస్తారు. పొరపాటున మీరు ఈ సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో ఆనందంతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకు పోతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే సూర్యస్తమయానికి ముందే ఇల్లు శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. మీకు అన్ని శుభ ఫలితాలొస్తాయి.
తెల్లని వస్తువులను ఇవ్వొద్దు (Vastu Tips)..
జ్యోతిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం కలియుగంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత పాలు, పెరుగు, పంచదారతో పాటు ఇతర తెల్లని వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ చంద్రుడికి ప్రతీకగా ఉంటాయి. అందుకే సంధ్యా వేళలో తెల్లని వస్తువులను ఇవ్వరాదు. ఒకవేళ ఇస్తే మీకు మనశ్శాంతి అనేది కరువవుతుందని చాలా మంది చెబుతారు. వీటితో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా ఇవ్వకూడదు.
అప్పులు ఇవ్వడం..
సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే సాయంకాలం వేళలో మీరు డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. అదే విధంగా ఉప్పును కూడా సంధ్యా వేళలో దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చెత్త..
సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంట్లో చెత్తను ఎట్టి పరిస్థితుల్లో బయట వేయకూడదు. కేవలం ఉదయం పూట మాత్రమే వేయాలి. మీరు పొరపాటున సాయంకాలం వేళలో చెత్తను బయటకు వేస్తే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుందని నమ్ముతారు. అలాగే సాయంకాలం వేళలో మీ ఇంటికి ఎవరైనా ఆతిథ్యం స్వీకరించడానికి వస్తారో.. వారిని ఒట్టి చేతులతో బయటకు పంపకూడదు. తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి.
గోళ్లను, కురులను కత్తిరించడం..
సంధ్యా వేళలో హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం, గోళ్లను కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడొచ్చు. వైవాహిక బంధంలో ఉండే వారు ఈ సమయంలో కలయికలో పాల్గొనకూడదు.
ఈ విధంగా పలు పనులను సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.