Vastu Tips : ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే.. ఇళ్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాగే స్వచ్చమైన గాలిని కూడా అందిస్తాయి. అందం, ఆరోగ్యం మాత్రమే కాకుండా.. కొన్ని మొక్కలు వాస్తు ప్రకారం అదృష్టాన్ని కూడా అందిస్తాయి అని తెలుస్తుంది. అయితే ఏ ఏ మొక్కలు అదృష్టాన్ని అందిస్తాయి.. ఏ ఏ దిశలో ఉంచితే మంచిదో మీకోసం ప్రత్యేకంగా.. అలానే కొన్ని మొక్కలు నెగిటివిటీని కూడా తెస్తాయట. వాస్తు ప్రకారం వాటిని ఇంట్లో పెంచకపోవడమే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ మొక్కలేంటో తెలుసుకుందాం..
ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు (Vastu Tips)..
తులసి చెట్టు..
తులసి చెట్టును కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే.. ప్రతికూల సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. ఇవే కాకుండా.. ఈ చెట్టు ఆకులను జలుబు, దగ్గు వంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. తులసి చెట్టు ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండాలి.
షమీ చెట్టు..
ఈ చెట్టును ఎక్కువగా శని దేవుడి ప్రియమైన మొక్కగా భావిస్తారు. ఈ చెట్టు ఇంటి ముందు పెట్టి ప్రతిరోజూ పూజించాలి. షమీ చెట్టు ఇంట్లో ఉంటే వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి.
మనీ ప్లాంట్..
మనీ ప్లాంట్ ను లక్షీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీ దేవి ఆనందిస్తుంది అంటారు. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. దీనిని ఆగ్నేయ దిశలో నాటాలి.
జాడే ప్లాంట్..
గుండ్రని ఆకులు కలిగిన జాడే ప్లాంట్ ను చాలా పవిత్ర చెట్టుగా భావిస్తారు. ఈ మొక్కను ఇంటి గుమ్మానికి కుడివైపు ఉంచాలి. అలాగే ఇది ఒక మీటరు కంటే ఎక్కువగా పెరగకూడదు. జాడే మొక్క ఇంట్లో ఉంటే.. సమస్యలు తొలగిపోయి.. సంపద పెరుగుతుంది. ఇది పనిచేసే చోట కూడా ఉండవచ్చు.
జంబు చెట్టు..
వాస్తు ప్రకారం వెదురు మొక్కలను చాలా పవిత్రంగా భావించాలి. ఫెంగ్ షూయ్ లో అదృష్టాన్ని అందిస్తుంది. అందుకే దీనిని లక్కీ ట్రీ అంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో లేదా కార్యాలయంలో ఎర్రటి దారంతో కట్టబడిన వెదురు మొక్కల కట్టను ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంద. ఇంటి సభ్యుల జీవితాన్ని కూడా పెంచుతుంది. కానీ మీరు ఈ మొక్కను నాటిన కుండ లేదా కుండలో నీటితో పాటు రాళ్ళు ఉండాలి అని గుర్తుంచుకోండి.
ఇంట్లో పెంచకూడని మొక్కలు..
క్యాక్టస్..
వీటినే ఎడారి మొక్కలు అని కూడా అంటారు. వాస్తు ప్రకారం వీటిని పెంచకపోవడమే మంచిదట. వాటికి ఉండే ముళ్లు నెగిటివ్ ఎనర్జీని వ్యాపింప చేస్తాయట.
బోన్ సాయి..
చాలా మంది పెద్ద చెట్లు పెంచలేక.. వాటి స్థానంలో బోన్ సాయి మొక్కలుగా మార్చి ఇంట్లో పెంచుతున్నారు. కానీ.. నిజానికి వాస్తు ప్రకారం ఈ మొక్కలు కూడా ఇంట్లో పెంచడం మంచిది కాదట. ప్రకృతి విరుద్దంగా వాటిని పెంచడం కూడా నెగిటివ్ ఎనర్జీ కి కారణం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/